సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానా న్ని పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అమలాపురం అధ్యక్షుడు నాగిరెడ్డి శివప్రసాద్ డిమాండు చేశారు. మద్దాలవారిపేటలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఎస్.గోపిరాజు అధ్యక్షతన ఆదివారం ఎస్టీయూ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పీవీఎస్ రామారావు(దొరబాబు) మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిపడ్డ అన్ని ఆర్థిక సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమావే శంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లి ప్రసాద్, ఎస్టీయూ జిల్లా అభయ్ కన్వీనర్ సరిదే సత్యపల్లంరాజు, ఉపాధ్యాయవాణి కన్వీనర్ చిక్కం మైనరుబాబు, మహిళా అధ్యక్షురాలు ఆర్.దుర్గ, ప్రధాన కార్యదర్శి కేఆర్ఎన్ ప్రసాద్, కేఎస్ఎన్ మూర్తి, ఎంఎస్ఎన్ మూర్తి, ఎంఎంకేజీ మొయినుద్దీన్, కాశి వెంకట్రావు, ఎస్.గోపాలస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.