తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఎమ్మెల్యే ఆగని సత్యప్రసాద్ స్పందించారు. తమ శాఖల ప్రగతిపై ఏనాడూ స్పందించని మంత్రులు ఈ సభకు మాత్రమే స్పందిస్తున్నారని విమర్శించారు.కాఫీ కోసం చంద్రబాబు, పవన్ కలిస్తే స్పందించిన 12 మంది మంత్రులు... ఇద్దరూ కలిసి భోజనం చేస్తే ఈ మంత్రుల పరిస్థితి ఏంటి! అని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు.ఈ భేటీపై వైసీపీ మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు.