ఏపీలోని మరో 2 నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి తిరుపతి, నెల్లూరులో జియో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో ఈ సేవలు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి ఏపీలోని ప్రతి పట్టణం, పల్లెల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో ప్రకారం, ఆ నగరాల నివాసితులు జియో 1Gbps ప్లస్ వేగంతో అపరిమిత డేటాను ఉపయోగించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa