జైశ్రీరామ్ స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ఆముదాలవలస పట్టణంలోని కొత్తకోట వారి వీధి సమీపంలో ఉన్నటువంటి శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి విశ్వహిందూ పరిషత్ ఆముదాలవలస ప్రఖండ అధ్యక్షులు అంపోలు రామాచార్యులు విగ్రహ దాత స్వర్గీయ భద్రం వేణుగోపాలరావు, తనయుడు రామానుజాచారి మరియు ప్రఖండ సభ్యులు అందరూ స్వామివారి విగ్రహానికి పుష్పమాలంకరణ గావించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖండ కార్యదర్శి మన్మధరావు, సత్సంగ్ ప్రముఖు రఘురామస్వామి, వీటి నాయుడు, సుబ్రహ్మణ్యం, సంజీవ్ రావు మాస్టారు మరియు పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా సత్సంగ్ ప్రముఖు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.