అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం, వెలిగొండ గ్రామానికి చెందిన జ్యోతి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలోనే తన పుట్టనిళ్లయిన ఇంద్రవతి గ్రామానికి చేరుకొని మంగళవారం తెల్లవారుజామున బహుర్బుమికి వెళ్ళొస్తానని చెప్పిన ఆమె గ్రామ శివారులో ఉన్న హంద్రీనీవా కాలువలోకి దూకింది. బంధువులు కాలువ వెంబడి గాలించగా రాకేట్ల గ్రామ సమీపంలో కాలువలో గురువారం శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.