పట్టణంలోని డీ. సీ. ఎం. ఎస్ కోపరేటివ్ సొసైటీ ఆవరణలో గురువారం వికలాంగులకుఉచితంగా వస్త్రాలు పంపిణీ జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పి వీరు యాదవ్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో జీ. వీ. ఎం. సీ అనకాపల్లి జోనల్ కమిషనర్ ఎస్. వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమీషనర్ చేతుల మీదుగా దివ్యాంగులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి అమ్మ వెల్ఫేర్ సొసైటీ, కుంచ అరుణ్ కుమారి, అనకాపల్లి స్వర్ణాజ్యువెలర్స్అధినేతబుద్ధశ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి రాజానదొరబాబు, బొద్దపుఉమాశంకర్ , బి. గణేష్ మాస్టర్ ల సహకారంతో వస్త్రాలు పంపిణీ అనంతరం భోజన కార్యక్రమం జరిగింది