ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజే సేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని జనరల్ మేనేజర్ జి.రమేష్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.399కే ఫైబర్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. పట్టణ ప్రజలకు ఫైబర్ బేసిక్ నియో పేరుతో రూ.449 కే 30 ఎంబీబీఎస్ స్పీడుతో 3300 జీబీ డేటా డౌట్‌లోడ్ లిమిట్‌తో ప్రవేశపెట్టిందని చెప్పారు. నాణ్యమైన ఫైబర్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి టెలికాం ఇన్ర్ఫాస్ట్రక్చర్ ప్రొవైడర్(టీఐపీ) విధానాం ద్వారా మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.