నంద్యాల జిల్లా , దొర్నిపాడు మండలం, చాక రాజువేములలో విషాదం నెలకొంది. ప్రేమికురాలి తల్లిదండ్రుల బెదిరింపులతో దళిత యువకుడు ప్రసన్నకుమార్ (24) విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ యువతిని ప్రసన్నకుమార్ ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ప్రియురాలి తల్లిదండ్రులకు తెలిసింది. తమ అమ్మాయిని మర్చిపోవాలని లేదంటే చంపేస్తామని యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.