తన వివాహేతర సంబంధానికి అడ్డు ఉందన్న ఉద్దేశంతో భార్యను కడతేర్చిన శేఖర్‌ను అరెస్టు చేసి రిమాండుకు పంపామని వెదురుకుప్పం ఎస్ఐ గోపి బుధవారం తెలిపారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం పంచాయతీ నక్కలాంపల్లెకు చెందిన శేఖర్ 8వ తేది రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోనే భార్య తేజశ్రీ గొంతు బిగించి హతమార్చాడన్నారు. ఆమే ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించాలని చూశాడన్నారు. మృతురాలి తండ్రి చలపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ క్రమంలో కార్వేటినగరం మండలం చింతమండి వద్ద శేఖర్ ఉండగా సీఐ చంద్రశేఖర్, తాను, తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నామన్నారు. పుత్తూరు కోర్టులో అతడిని హాజరు పరచి రిమాండుకు తరలించామని ఎస్ఐ చెప్పారు.