భీమిలిలో దారుణ సంఘటన జరిగింది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చిన సంఘటన గరువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడు ప్రియుడు శ్రీనువాసురావు ( 23 ) మోజులో భర్త పైడరాజు ( 34 ) ను భార్య జ్యోతి ( 26 ) హతమార్చింది. భర్తను చంపి బండి మీద మృతదేహాన్నితీసుకొచ్చి కైలాసగిరి శ్మశాన వాటికలో ఎవరికీ తెలియకుండా దహనం చేశారు. భర్త కనిపిండం లేదని ఫిర్యాదు చేసింది. మృతుడు అన్నయ్య వంక చిన్నారావు ఫిర్యాదుతో భీమిలీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిస్సింగ్ కేసు విచారణలో తాళి కట్టిన భార్యే నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు. మరిన్ని పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. భీమిలీ సిఐ లక్ష్మణ్ మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.