మనం రోజూ తీసుకునే ఆహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ఆధ్య దంత వైద్యశాల వైద్యులు కె. ఎస్. ఎన్. రెడ్డి అన్నారు. స్థానిక కె. వి. ఆర్ ఫంక్షన్ హాల్ నందు గురువారం గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు డి. అమిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సు కార్యక్రమానికి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నోటితో తీసుకునే ఆహారం వలన వ్యాధులు సోకకుండా వుండాలంటే ఎప్పటికప్పుడు దంతాలు శుభ్రపరుచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిది ఆద్య డెంటల్ కేర్ స్త్రీల దంత వైద్యులు కె. దీపికా రెడ్డి మాట్లాడుతూ చక్కని ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారం తో బాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు.
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు. చక్కని ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ, వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అందరకు తెలియ జేయాలని గ్రామీణ వైద్యుల (ఆర్. ఎం. పి)ను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల కార్యవర్గ సభ్యులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జోషి, ఎం. తిరుపతిరావు, డివిజన్ అధ్యక్షుడు ఎం. రాజు, జిల్లా అధ్యక్షులు ఆడారి రమణ, జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు, చోడవరం డివిజన్ అధ్యక్షుడు డి. అమిత్ కుమార్, ప్రచార కార్యదర్శి శ్రీనివాసరావు, కార్యదర్శి ఆదినారాయణ, కోశాధికారి ఐ. కొండలరావు, డివిజన్ పరిధిలోని గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.