బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. అనంతరం రాజ్య సభ సభ్యులు జీవీ ఎల్ నరసింహా రావు, బీజేపీ విశాఖ పట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ఎం. రవీంద్ర, జిల్లా జాయింట్ కలెక్టర్ కే. ఎస్. విశ్వనాథన్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రాజ్య సభ సభ్యులు జీవీ ఎల్ నరసింహా రావు మాట్లాడుతూ, టీటీడీ వసతి గదుల అద్దె పెంపు వలన సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది కలుగు తుందన్నారు. అలాగే, శ్రీ శైలం దేవస్థానం లో జరిగిన అవక తవకల పై ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు. అంతకు ముందు ఆయన మీడియా తో మాట్లాడుతూ, తిరుమల కొండ పైన సామాన్య భక్తులు విడిది చేసే నారాయణం లో గదుల అద్దె లను రూ. 150 నుంచి ఏకంగా రూ. 1500 కి, రూ. 750 గదుల అద్దెలను రూ. 2. 200 కి పెంచడం దారుణమన్నా రు. ప్రభుత్వ తీరు హిందూ ధర్మం పైన వేటు వేసేలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు.
అన్య మతస్తు ల నుంచి ఏ ఆదాయం రాకున్నా సరే ప్రభుత్వం పాస్టర్లు, ఇమామ్ లకు ఆర్థిక సాయం చేస్తుందన్నారు. టీటీడీ అద్దెలు తగ్గించ క పోతే రాష్ట్రంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. యువ మో రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, తిరుమల వెయ్యి కాళ్ళ మండపం కూల్చివేసిన తరువాత చంద్ర బాబు కి ఏ గతి పట్టింది గుర్తు చేసుకోవాలి అన్నారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తిరుమల ను చిన్న చూపు చూసి ఏ మయి పోయారో అందరి కీ తెలుసు అన్నారు. సీఎం జగన్ కూడా అదే దారిలో పయనిస్తున్నారు అని అన్నారు.
బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం. రవీంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వం పెంచిన అద్దెలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ, మధ్య తరగతి ప్రజలు భక్తిని కూడా వ్యాపార మయం చేస్తూ, ప్రభుత్వం కు సంస్కారం బయట పెట్టుకుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపా ద్యక్షులు పి. విష్ణు కుమార్ రాజు, బీజేపీ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జి రామ్ కుమార్, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు సంజీవరావు, గాజువాక ఇంఛార్జి కరణం రెడ్డి నరసింగ రావు, మహిళ మో ర్చ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షు రాలు లలిత, నగర ఊపా ధ్యక్షులు సీ హెచ్. రాంబాబు, మైనారిటీ మోర్చ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు శ్రీ సీ హెచ్. రాజబాబు, నగర ఉపాధ్యక్షులు టీ. భారతి, తదితరులు పాల్గొన్నారు