వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం విశాఖ ప్రజలు ఎంతో కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రానికి ఈ రైలును కేటాయించకపోయినా...తెలంగాణాకు ఇచ్చిన రైలును విశాఖపట్నం వరకు నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అది కూడా ఈ నెల 15వ తేదీ నుంచే ప్రారంభం కానుంది.
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడపాలనుకున్న ఈ రైలును విశాఖపట్నం వరకు పొడిగించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య దూరం 702 కిలోమీటర్లు కాగా ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సగటు ప్రయాణ సమయం 12 గంటలు. అదే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అయితే 8.40 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. దీని వేగం గంటకు 160 కి.మీ. కాగా...83 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.