ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి మళ్లీ వైద్యుడయ్యారు... డెంటల్ సర్జరీ చేసిన త్రిపుర సీఎం

national |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 07:07 PM

పాలన, రాజకీయాలతో బీజీగా ఉండే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ వైద్యుడిగా మారిపోయారు. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజ్ లో పదేళ్ల బాలుడికి డెంటల్ సర్జరీ స్వయంగా చేశారు. మాణిక్ సాహ వృత్తి రీత్యా డెంటల్ వైద్యుడు కావడం గమనార్హం. ఈ శస్త్ర చికిత్సకు సంబంధించిన ఫొటోలను త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


‘‘నేను గతంలో పనిచేసిన త్రిపుర మెడికల్ కళాశాలలో.. పదేళ్ల అక్షిత్ ఘోష్ అనే బాలుడికి ఓరల్ సిస్టిక్ లెషన్ సర్జరీ నిర్వహించడం పట్ల సంతోషంగా ఉంది. చాలా విరామం తర్వాత సర్జరీ చేసినా, ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. పేషెంట్ ఆరోగ్యం బాగుంది’’ అని మాణిక్ సాహ ట్వీట్ పెట్టారు. రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కళాశాలలో డాక్టర్ మాణిక్ సాహ ప్రొఫెసర్ గా వైద్య పాఠాలు బోధించేవారు. ఉదయం 9 గంటలకు సర్జరీ రూమ్ కు వచ్చిన డాక్టర్ సాహ అరగంట తర్వాత నవ్వుతూ బయటకు వచ్చేశారు. ఆయనకు పలువురు వైద్యుల బృందం సర్జరీలో సాయపడింది. 2022 మేలో త్రిపుర సీఎంగా మాణిక్ సాహ అధికారం చేపట్టారు.


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com