యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. తల్లితో 15 ఏళ్ల బాలిక మంగళవారం గొడవపడింది. ఇంటికి కోపంగా బయటకు వచ్చేసింది. ఢిల్లీ వెళ్లే ఆటో ఎక్కింది. అయితే నజీమ్ (23), జాహిద్ (22) అనే ఇద్దరు యువకులు ఆ బాలికను ఆటోలో తిప్పుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చివరికి నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బుధవారం నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.