"నేను బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు మా వాళ్లంతా నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. తమ ఇంట్లో నన్ను ఉండమంటూ పట్టుబట్టేవారు. కానీ డబ్బులు లేవని తెలిసి ఇప్పుడు అంతా దూరం పెట్టారు. అయినవాళ్లు ఉన్నారు .. కానీ కాల్ చేసినా ఫోన్ ఎత్తరు. ఇప్పడు నాకు రోజు గడవడమే కష్టంగా ఉంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నీ నటిి పాకిజా.
'అసెంబ్లీ రౌడీ' సినిమా చూసినవాళ్లు, అందులోని 'పాకీజా' పాత్రను మరిచిపోలేరు. ఆ సినిమాలో గొడుగు తిప్పుతూ నడుస్తూ .. బ్రహ్మానందానికి మస్కా కొట్టే పాత్ర అది. ఆ సినిమా విడుదలై చాలాకాలమే అయినా ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. 'అసెంబ్లీ రౌడీ' తరువాత చాలా సినిమాలు చేసిన ఆమె, ఆ తరువాత కనుమరుగవుతూ వచ్చారు.
తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని నేను చాలా సినిమాల్లో చేశాను. డబ్బులు కూడా బాగానే సంపాదించాను. వరుస వేషాలతో నేను బిజీగా ఉన్నప్పుడు, విమానాల్లో తిరిగాను. పారితోషికం కూడా బాగానే ఇచ్చేవారు" అన్నారు.
" మా అమ్మ కేన్సర్ బారిన పడింది .. ఆమె ట్రీట్మెంట్ కి చాలా పెద్ద మొత్తమే ఖర్చు అయింది. ఇక మా ఆయన తాగుబోతు. ఎప్పుడూ తాగేసి వచ్చి నన్ను కొడుతూ ఉండేవాడు. ఆ తరువాత తను చనిపోయాడు. మా చెల్లెలు పెళ్లి నేనే చేయవలసి వచ్చింది .. ఇక నాకు పిల్లలు లేరు" అని చెప్పారు.
"నేను బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు మా వాళ్లంతా నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. తమ ఇంట్లో నన్ను ఉండమంటూ పట్టుబట్టేవారు. కానీ డబ్బులు లేవని తెలిసి ఇప్పుడు అంతా దూరం పెట్టారు. అయినవాళ్లు ఉన్నారు .. కానీ కాల్ చేసినా ఫోన్ ఎత్తరు. ఇప్పడు నాకు రోజు గడవడమే కష్టంగా ఉంది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.