ట్రాక్టర్ ఢీకొని షేక్.సుహేల్(20) అనే విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన గురువారం కడప జిల్లా, బి.కొత్త కోట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.....పీటీఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన ఫయాజ్ కుమారుడు షేక్.సుహేల్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ ప్రైవేటు కళా శాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువు తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో రెండురోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్రవాహనంలో బి.కొత్తకో టకు బయలుదేరగా దారిలో మల్లెల సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో విద్యార్థి తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభు త్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా మారడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సుహేల్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. కాగా విద్యార్థి సం క్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చి మృత్యువాతపడడంతో బాధిత కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. ఈ ఘటనతో మల్లెల గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న బి.కొత్తకోట పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసునమోదు చేసినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa