కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26 నుంచి మార్చి 26 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ప్రకటించారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాతో పాటు కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు పూర్తి చేసుకుని గురువారం మదనపల్లెకు వచ్చినట్లు చెప్పారు. సైదాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా ఆధ్యర్యంలో రాజంపేట పార్లమెంటు స్థాయి కార్యనిర్వాహక సమావేశంలో గుడుగు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని, ఏపీకి ప్రత్యేగా హోదా రావాలంటే రాహూల్‌గాంధీ ప్రధాని కావాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌చార్జ్ మయప్పన్, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ జంగా గౌతమ్, ఏఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ నాగమధుయాదవ్, ఏపీసీసీ మెంబర్ షంషీర్, స్టేట్ ఓబీసీ జాయింట్ కో- ఆర్డినేటర్ నాగూర్‌వల్లి, వేమయ్య, డీసీసీ అధ్యక్షుడు గిరీష్, పట్టణ అధ్యక్షుడు రెడ్డిసాహెబ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇంతియాజ్, నజీర్, రెడ్డీబూ, తదితరులు పాల్గొన్నారు.