ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు తన వద్ద చదువుకునేందుకు వచ్చిన విద్యార్థినిపై మూడేళ్లుగా లైంగిక దాడి చేయడంతో పాటు బలవంతంగా పెళ్లి చేసుకుని, నిర్బంధించడమే కాకుండా రూ.2 లక్షలు తీసుకున్న వైనం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగుచూసింది. పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలానికి సంబంధించి బాధితురాలి కుటుంబసభ్యులు గురువారం నరసరావుపేట డీఎస్పీ విజయ్‌భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. ఈపూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి వరకు స్థానికంగా ఉం డే ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివింది. సదరు పాఠశాలలో లెక్కలు ఉపాధ్యాయు డైన అదే ప్రాంతానికి చెందిన బత్తుల రవికుమార్ సదరు బాలిక పదో తరగతి చదివే సమయంలో తన ఇంటికి పిలిచి శీతల పానీయంలో మత్తు ఇచ్చి అసభ్య కరంగా ప్రవర్తించాడు. పైగా వివస్త్రగా ఉన్న ఫొటోలు తీసి వాటిని చూపించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఎవరికైనా ఈ విషయం చెప్తే ఫొటోలను వైర ల్ చేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో అతడినుంచి తప్పించుకునే క్రమంలో బీటెక్ మొదటి సంవత్సరం తమిళనాడులో చేరినా ఫోన చేసి వేధించేవాడు. తాను చెప్పినట్టు వినాలని, పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఫొటోలను వైరల్ చేస్తానని బెది రించాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబరు 31న విద్యార్థిని గ్రామానికి వచ్చి న విషయం తెలుసుకున్న రవికుమార్ బలవంతంగా వారి ఇంటికి తీసుకువెళ్లి వారి కుటుంబసభ్యుల సమక్షంలో బలవంతంగా తాళి కట్టాడు. తదుపరి తనను ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. విద్యార్థిని మేజరు అయిన విషయం తెలుసు కుని గత ఏడాది నవంబరు 22 రాత్రి సమయంలో ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్లాడు. ఆపై హైదరాబాద్, నాగపూర్, ఆగ్రా, ఢిల్లీల్లో తిప్పి పిడుగురాళ్లలో వారి వదిన ఇంట్లో బాధితురాలిని నిర్భందించాడు. పైగా బెదిరించి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని మహిళా కమిషన ఎదుట రవికుమార్ బాధితురాలితో ఫిర్యాదు చేయించాడు. నిందితుడి వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో తమ కుమా ర్తెతో కలిసి పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె కుటుంబసభ్యులు గురువారం విలేకర్లకు తెలిపారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి వీడియోలు, ఫొ టోలు తీసి వాటిని చూపిస్తూ బెదిరించి విడతల వారీగా రూ.2 లక్షలు తీసుకు న్నట్లు రవికుమార్‌పై బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. రవికుమా ర్‌తో పాటు అతడికి సహకరించిన వారిపై చర్యలు తీసుకుని ఫొటోలు, వీడియో లు ఇప్పించి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు. తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈపూరు ఎస్‌ఐని డీఎస్పీ ఆదేశించారు.