‘‘మేమేం పీకామో, పీకలేదో ప్రజలు చూస్తారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఎనిమిదేళ్లు, మాజీ సీఎం చంద్రబాబుతో ఐదేళ్లు ఉన్నావ్.. రాష్ట్రానికి ఏం పీకావ్’’ అని పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘నా దగ్గరా రెండు చెప్పులున్నాయి. పవన్ నోటి జాడింపు మానుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు. పవన్ బిల్డప్ బాబాయ్. ఏ రోటికాడ ఆ పాట పాడేరకం. జగన్ వల్ల కాదు... పవన్ వల్లే కాపులకు ఇబ్బంది. పవన్‌ను మా వాడని చెప్పుకోడానికి సిగ్గేస్తుంది’’ అని పేర్ని విమర్శించారు.