వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కే పార్థసారథి తండ్రి, మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య యాదవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర మతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తండ్రి, మాజీ ఎంపీ కే.పి. రెడ్డయ్య యాదవ్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. విజయవాడ బందర్ రోడ్లో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి నివాసానికి చేరుకొని ఆయన తండ్రి, మాజీ ఎంపీ రెడ్డయ్య యాదవ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం పార్థసారధి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరామర్శించారు.