అప్పుడే పుట్టిన శిశువును తల్లి నడి రోడ్డుపై విడిచిపెట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం కోష్ట జంక్షన్‌కు కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. గ్రామ సమీపంలో నిమానుష ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును నడిరోడ్డుపై ఎవరో మాతృమూర్తి విడిచిపెట్టి వెళ్లారు. నిశిరాత్రిలో శిశువు ఏడుపును గమనించిన అటుగా వెళ్తున్నవారు ఆ పసికందును అక్కున చేర్చుకున్నా రు. పోలీసులకు సమాచారమందించారు. జేఆర్ పురం సీఐ ఆదాం, ఎస్ఐ రాజేష్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మహిళా పోలీస్ సాయంతో కొండములగాం పీహెచ్ సీకి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఐసీడీఎస్ సంరక్షణలో ఆ శిశువును ఉంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఐ ఆదాం తెలిపారు.