ఏపీకి సంక్రాంతి లేకుండా చేసిన ఘనత సీఎం జగన్‌దేనని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సంక్రాంతి సంబరాలు చేసుకునే రాష్ట్ర ప్రజలకు జగన్ ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు మాత్రం కోడిపందాలు, పేకాటలు, విచ్చలవిడి గా నడిపిస్తున్నారన్నారు. జీవో 1 పట్ల ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయిందని.. కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదన్నారు. చంద్రబాబు-పవన్‌కల్యాణ్ కలిస్తే జగన్‌రెడ్డికి నొప్పి ఎందుకని ఆయన ప్రశ్నించారు.