తాడిపత్రి పట్టణంలోని విజయనగర్కాలనీకి చెందిన అంకాలమ్మ మెడలో నుంచి శుక్రవారం రాత్రి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని పట్టణ పోలీసులు తెలిపారు. అంకాలమ్మ ఇంటికి వెళుతున్న సమయంలో ద్విచ క్రవాహనంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గొలుసును లాగడంతో అప్రమత్తమై గట్టిగా పట్టుకోవడంతో తెగిపోయింది. దీంతో సగభాగం దుండగులు ఎత్తుకెళ్లారు. చైన్ మొత్తం నాలుగు తులాలు ఉందని బాధితురాలు తెలిపింది. అదేవిధంగా పడమటిగేరిలో దుం డగులు మహిళ మెడలో నుంచి గొలుసును అపహరించే ప్రయత్నం చేయగా విఫలమైందని పోలీసులు తెలిపారు. అంకాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు.