ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్షద్వీప్‌ ఎంపీపై అనర్హత వేటు

national |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 11:21 AM

లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై లోక్‌సభ స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా తేలడంతో కవరట్టీ సెషన్‌ కోర్టు ఫైజల్ కు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయనపై అవర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 11నే ఇది అమల్లోకి వచ్చిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(I) (e) ప్రకారం నిర్ణయం తీసుకున్నామని నోటిఫికేషన్‌లో వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com