నాగాయలంక శ్రీరామపాదక్షేత్రంలో శనివారం జరిగిన భోగి మంటల వేడుకల్లో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను ఆయన ప్రారంభించగా, టిడిపి నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాటు వద్ద పడవల పోటీలు నిర్వహించేవారు. ఏడాది భోగి వేడుకలను ఆ ప్రాంతంలో నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.