దేశ వ్యప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా సీబీఐ ఢిల్లీ సచివాలయంలో సోదాలు చేపట్టింది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంలో తనిఖీలు జరిపింది.
దీనిపై మనీశ్ సిసోడియా స్పందిస్తూ, సచివాలయంలోని తన కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారని నిర్ధారించారు. అయితే తన కార్యాలయంలో సీబీఐకి ఏమీ దొరకలేదని అన్నారు. తన కార్యాలయంలో తనిఖీ చేసి లాకర్లు తెరిచి చూశారని, తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, తానేమీ భయపడడంలేదని సిసోడియా స్పష్టం చేశారు.
"ఇవాళ సీబీఐ అధికారులు మళ్లీ నా కార్యాలయానికి వచ్చారు. మా ఊర్లోనూ విచారణ జరిపారు. నాకు వ్యతిరేకంగా వారికి ఏమీ లభించలేదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదు కాబట్టి" అంటూ సిసోడియా ట్విట్టర్ లో పేర్కొన్నారు.