శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండలంలోని ఆమీదాలాగొంది పంచాయితీ హెచ్. ఆర్. పాల్యం గ్రామానికీ చెందిన వైసిపి నాయకులు సోమవారం టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేయడం తమ ప్రధాన లక్షమని వైసీపీ అవినీతి పాలనకు వ్యతిరేకమై పార్టీని వీడినట్లు తెలిపారు. అనంతరం ఈరబెన్నప్ప, హనుమంతారాయప్పలను వారికి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.