శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని త్యాగరాజు నగర్ ఉమా నర్మదేశ్వర శివాలయం గర్భగుడి గోపురంకు కలశంను తెలుగుదేశం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ సోమవారం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు కలశాన్ని అందజేయాలని అంబికాని కోరగా ఆయన స్పందించి నూతన కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అశ్వత్థ నారాయణమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు గోవిందరెడ్డి, ప్రదీప్, గంగాధర్, అశోక్, రఘురామప్ప, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.