పాకిస్థాన్లోని పెషావర్ హైకోర్టులో సోమవారం ఓ దారుణం జరిగింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సిబిఎ) మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది లతీఫ్ అఫ్రిదీని దుండగులు కాల్చి చంపారు. హైకోర్టు లోపలే దుండగుడు అతడిని కాల్చి చంపి పారిపోయాడు. తోటి లాయర్లు లతీఫ్ అఫ్రిదీని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.