21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులందరినీ కిందకు దించారు. గుర్షాగంజ్ లోని జసోదా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు దగ్ధమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్ డ్రైవర్ అప్రమత్తత వల్ల ఘోర ప్రమాదం తప్పింది.