కరోనా సోకిన వ్యక్తులకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా బాధితులకు లక్షణాలు కనిపిస్తే అవి మొదలైనప్పటి నుండి 10 రోజులపాటు ఐసొలేషన్ లో ఉండాలని తెలిపింది. మాస్కులను ధరించాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయినా కూడా లక్షణాలు లేని వారు 5 రోజులపాటు ఐసొలేషన్ ఉండాలని, కరోనా సోకిన వారికి యాంటిజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే ఐసొలేషన్ నుంచి ముందుగానే బయటకు రావొచ్చని తెలిపింది.