ఉక్రెయిన్లోని నీప్రో నగరంలో ఓ అపార్ట్మెంట్పై రష్యా శనివారం భీకరదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 40కి చేరిందని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భవనంలో మొత్తం 1,700 మంది నివసిస్తున్నారు. ఇప్పటి వరకూ 39 మందిని సహాయక సిబ్బంది రక్షించగా మరో 30 మంది జాడ తెలియడంలేదు. మొత్తం 75 మంది గాయాలపాలయ్యారు. పౌరులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అక్కడి అధికారులు తెలిపారు.