మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రోడ్డు దుస్థితికి క్షమాపణలు చెపుతూ ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. ‘‘రోడ్డు దుస్థితికి నేను ప్రజలకు క్షమాపణలు చెపుతున్నాను, మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను’’ అని మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ చెప్పారు.