పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన 600 మంది భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు. గంగాసాగర్‌లో ఏటా సంక్రాంతి రోజున లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అలాగే ఈ సారి గంగాసాగర్‌లో పుణ్యస్నానాల కోసం 600 మందికిపైగా యాత్రికులతో బయలుదేరిన 2 నౌకలు పొంగమంచు వల్ల ఎంవీ లచ్చమతి ద్వీపం వద్ద చిక్కుకుపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.