ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగ ఉత్సవాలు సందర్భంగా ఈ నెల 20వ తేదీన త్రిపురాంతకంలోని బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ కె కిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలాపు సురేష్ హాజరు కానున్నారు. కావున మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా మధ్యాహ్నం 2గంటలకు హాజరు కావాలని అన్నారు.