ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కి ఎమ్మార్పీఎస్ వినతి పత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 04:23 PM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు మంగళవారం కడప జిల్లా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కడప జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి కె. వి లక్ష్మీనారాయణ రెడ్డికి వినతి పత్రము అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బిజెపి పార్టీ మాదిగల ఆవేదనను 8 సంవత్సరాలుగా అర్థం చేసుకోకుండా మాదిగలను కేవలం ఓటు బ్యాంకింగ్ గా వాడుకుంటూ, వారి ఆవేదనను గుర్తించకుండా కాలయాపన చేస్తున్నదని వివరించడం జరిగినది.


వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో యంఆర్పియస్ కడపజిల్లా కన్వీనర్ మాణికింది వెంకటేష్ మాదిగ, యంయస్పి జిల్లా నాయకులు జయచంద్ర మాదిగ, మాత్తయ్య మాదిగ, నరసింహ మాదిగ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com