అనంతపురం నుండి ఓ మతిస్థిమితం లేని యువకుడు రైల్లో వచ్చి ఎర్రగుంట్లలో దిగి రోడ్డు ప్రక్కన, రైల్వే స్టేషన్, బస్టాండ్ దగ్గర ఎవరైనా ఏదైనా దయతలచి పండ్లు, ఆహారము వారికి తోచింది ఇస్తే తిని జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఇతనిని చూసుకునేవారు ఎవరు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో అతనిని గమనించిన దువ్వూరు మండలానికి చెందిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కదిరి సంజీవ రాయుడు యాదవ్ ఏదో ఒక సహాయం చేయాలని ఆలోచనతో తన ట్రస్టు సభ్యులకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని ట్రస్టు సభ్యులు కలిసి ఆటోలో తిప్పులూరు లో ఉన్న ఎద్దుల పెద్ద శేషమ్మ అనాధ ఆశ్రమం నిర్వాహకుడు నాగేంద్ర తో మాట్లాడి చేర్పించడం జరిగింది.
అక్కడే అతనికి స్నానం చేపించి, కొత్త బట్టలు తొడిగి ఆశ్రమంలో భోజనం పెట్టించి అక్కడ వదిలి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె ఎస్ ఆర్ హరిత ఫౌండేషన్ చైర్మన్ కదిరి సంజీవ రాయుడు యాదవ్, యునిస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివారు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే మాకు ఫోన్ చేయండి 9052636301 ఎద్దుల పెద్ద శేషమ్మ అనాధ ఆశ్రమము చేర్చడం జరుగుతుందని సంజీవ రాయుడు వివరించారు. వీరి సేవలు పట్ల పలువురు వారిని అభినందిస్తున్నారు.