మైదుకూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ గోశెట్టి నారాయణ మనవడు డాక్టర్ మాచనూరు రవితేజ ఐ సి ఏ ఆర్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపిక అయిన సందర్భంగా మంగళవారం మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర, మైదుకూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జి మాచనూరు సుబ్బరాయుడు, సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత మాచనూరు సాగర్, మాజీ మండల ఉపాధ్యక్షులు మాచనూరు సుబ్రహ్మణ్యం, మాచనూరు వంశస్థులు దాదాపు 60 మంది బంధువులతో, పూలమాలలతో, శాలువాలతో స్వీట్స్ బుకేలతో, ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీ మాచనూరు చంద్ర మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికైన డాక్టర్ రవితేజ , ఆచార్య యన్ జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ లో శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో బియస్సి అగ్రికల్చర్ చదివి డిస్టిన్క్షన్ సాధించారని తరువాత యంయస్సి లో ఆల్ ఇండియాలో ప్రవేశం పరీక్షలో 14వ ర్యాంక్ సాధించి ఢిల్లీలోని ఐఏఆర్ఐ లో సీటు సాధించి అగ్రికల్చర్ యంయస్సి లో గోల్డ్ మెడల్ సాధించి, తరువాత అగ్రికల్చర్ పిహెచ్డి లో ప్రవేశానికి వ్రాసిన పరీక్షలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఢిల్లీలో అదే యూనివర్సిటీ లో పిహెచ్డి సాధించారని, తరువాత ఆల్ ఇండియా లెవెల్ లో జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపిక అయినందువలన మైదుకూరు ప్రాంతానికి, అలాగే కడప జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారని వారు కొనియాడారు.