కడప జిల్లా కాజీపేట మండలంలో అతి పురాతనమైన కోదండ రామస్వామి దేవాలయం పూర్వం ఆర్యవైశ్యుల చే నిర్మాణం చేయడం జరిగినది. సంక్రాంత్రి, ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో జరిగిన కార్యక్రమమునకు ఆర్యవైశ్యుల సంఘం అధ్యక్షులు గంగిశెట్టి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తుడమలదిన్నె గ్రామ భజన సంఘం వారిచే హరినామ కీర్తనలచే రామనామ కీర్తనలు ఆలపించడం జరిగినది. శ్రీ శ్రీ శ్రీతారక రామ భజన మండలి తుడుమలదిన్నె వారిచే ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు గురువు మూల ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గాయని, గాయకులకు అందరికీ ఆర్యవైశ్యులసే ఆర్యవైశ్యుల సంఘం అధ్యక్షులు గంగిశెట్టి చే సన్మానం చేయడం జరిగినది.