పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా అటు పల్లెలూళ్లతోపాటు పట్టణాలలో సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఏడాదిలో తొలిసారిగా జరుపుకునే సంక్రాంతి పండుగ సరికొత్తదనం తెచ్చిపెడు తుందని ప్రజలు భావిస్తారు. ఈ పండుగలకు ఇతర ప్రాంతాలలో ఉన్న వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు భోగి పండుగ ముందురోజే వారివారి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఎంచక్కా కుటుంబ సభ్యులు బంధు మిత్రాదులతో కలిసి పండగు చేసుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజుల పాటు పండుగను ఘనంగా నిర్వహించారు. ఏడాది పొడవునా ఆయురారోగ్యాలతో పాటు బోగభాగ్యాలను ప్రసాదించాలని, కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా ఒమైక్రాస్ బిఎఫ్-7 వంటి వేరియంట్లను విముక్తి కల్పించాలని భగవంతుడిని వేడుకున్నారు.