మంగళగిరి నియోజకవర్గంలో వివిధవర్గాలవారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి నేతలు కూడా టిడిపితో కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు తాడేపల్లి మండలం ఉండవల్లిలోని నివాసంలో మంగళవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వివిధ గ్రామాల వారు టిడిపిలో చేరారు. తాడేపల్లి పట్టణ బీజేపీ నేత వీరదాసి సుధాకర్, వైసీపీ నేత యోగేశ్వరరావుల ఆధ్వర్యంలో 26 కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి పసుపుకండువాలు కప్పిన నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
చిర్రావూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు వీరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీ, మైనారిటీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలకు చెందిన 25 కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామన్నారు. వైసీపీ హయాంలో అన్యాయానికి గురైన వారందరికీ టిడిపి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న సైకో జగన్ రెడ్డిని ఇంటికి పంపించి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా సుబ్బారావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa