నరసరావుపేట జిల్లాలో, రాష్ట్రంలో పంపిణీ వ్యవస్థలోని ఎండీయూ ఆపరేటర్ల ద్వారా నిర్వహిస్తున్న రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ జనవరి 20వ తేదీ వరకు పొడిగించటమైందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జి. మోహనరావు మంగళవారం తెలిపారు. జనవరి మాసానికి ఇంకా రేషన్ సరుకులు తీసుకొని, లబ్ధిదారులు తమ ప్రాంతానికి పంపిణీ కోసం వచ్చే ఎండీయూ వాహన ఆపరేటర్ ద్వారా కార్డుపై బియ్యం ఉచితంగా పొందవచ్చన్నారు.