టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బుధవారం ఆయన 27వ వర్ధంతి కాగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పార్వతీపురం పట్టణం, జిల్లాలో వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాడవాడలా టీడీపీ శ్రేణులు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పార్వతీపురం పట్టణ నందమూరి సేవా సంఘం అధ్యక్షులు యడ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు మజ్జి కృష్ణారావు, 8. వ. వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఎన్టీఆర్ కీర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా అభిమాన సంఘ నాయకులు మాట్లాడుతూ తెలుగువారి వాడి, వేడి ప్రపంచానికి చాటిన మహనీయుడని, చరిత్ర పురుషుడని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెశిడెంట్ తోట నాగరాజు, కార్యదర్సిలు బూర్లి వెంకటేశ్ మక్కువ కిషోర్ రౌతు చిన్నారావు, వంగపండు వంశీ, వై. శ్రీను. పాకల సన్యాసిరావులు, అల్లూరి జగన్నాధరాజు. పాల్గొన్నారు.