ప్రస్తుతం ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు. దీంతో ఎక్కువ శాతం మంది గుండెలో మంటతో బాధ పడుతున్నారు. అలాంటి సందర్భంలో చిప్స్, మసాలా పదార్థాలు, చాక్లెట్ వంటి వాటిని తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఒకేసారి ఎక్కువ ఆహారం కాకుండా తక్కువ మొత్తంలో రెండు మూడుసార్లు తినడం మంచిది. గుండె మంటతో బాధపడే వారు భోజనంలో టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుంటే ఛాతీ మంట తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.