సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లిఖార్జునుడి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. గత 28 రోజుల్లో స్వామి, అమ్మవార్ల హుండీలకు రూ. 3,57,81,068 నగదు రూపంలో రాగా, 103.2 గ్రాముల బంగారం, 7.52 కిలోల వెండి వచ్చాయి. అంతేకాకుండా హుండీ లెక్కింపులో 243 యూస్ డాలర్లు, 220 యూఏఈ దిర్హమ్స్, 61 సింగపూర్ డాలర్లు, 175 ఆస్ట్రేలియా డాలర్లు, 20 కెనడా డాలర్లు, 25 ఇంగ్లాండ్ ఫౌండ్స్ లభించాయి.