ఇండోనేషియాలోని సులవేసిలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని యూఎస్ జీఎస్ తెలిపింది. సులవేసి ప్రావిన్స్ కు ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరొన్ టాలోలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. సముద్రంలో 145 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.