ఆర్థిక ఊబిలో చిక్కుకుపోయిన పొరుగు దేశానికి అండగా నిలిచేందుకు భారత్ సిద్ధమైంది. శ్రీలంకను అప్పుల ఊబి నుంచి బయటకి తీసేందుకు తమ వంతుగా సహాయ చేస్తామని ఐఎంఎఫ్ కు భారత్ లేఖ రాసింది. ప్రపంచ రుణ దాతల నుంచి 2.9 బిలియన్ డాలర్లను శ్రీలంక ఆశిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భాగంగా భారత్, చైనా దేశాలు చెరో 5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించాయి.