పదేళ్లకు ఒకసారి ఆధార్ లో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఇటీవల ఓ నిబంధనను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రజలు తమ ఆధార్ లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి 5 రోజులపాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని స్కూళ్లలో ఈ క్యాంపులు నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa