తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బుధవారం పరుచూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో మార్టూరులో భారీ బైక్ ర్యాలీ జరిగింది. మార్టూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొత్తగా ప్రతిష్టించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే ఇసుక దర్శి లోని తన క్యాంపు కార్యాలయం నుండి బైకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆయనను అనుసరించి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో మోత పుట్టించారు.